: ప్రతి సందర్భంలోనూ నాన్నను మిస్ అవుతున్నా: వైఎస్ జగన్


దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66వ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో తండ్రి జ్ఞాపకాలను, తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "నా ప్రతి సందర్భంలోనూ నాన్నను మిస్ అవుతున్నా. నా కష్టంలో వెన్నంటి ఉండేలా, ఎల్లప్పుడూ నాకు అండదండగా నిలిచేలా ఓ పెద్ద కుటుంబాన్ని ఆయన నాకు ఇచ్చివెళ్లారు. ఆయన గొప్పదనం, స్పూర్తిదాయకమైన జీవితం, ఆయన అడుగుజాడల్లో నేను నడిచేలా మరింత ధైర్యాన్ని, మీ మద్దతును నాకివ్వండి" అని జగన్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News