: అమెరికాలో 911 మాదిరిగా, మనకు 112 వస్తోంది
అన్ని రకాల అత్యవసర సేవలకూ ఓకే నంబరును వాడాలని భావిస్తున్న కేంద్రం ఆ దిశగా ముందడుగు వేయనుంది. అమెరికాలో 911 నంబర్ ఉన్నట్టుగా ఇండియాలో ఎమర్జన్సీ నంబర్ 112 త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రజా సంబంధ రవాణా వాహనాలలో బటన్ సర్వీస్ ను తీసుకురావాలని కూడా కేంద్రం భావిస్తోంది. 112 నంబరుకు చేసే కాల్స్ ఢిల్లీలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్ కు వెళ్తాయి. అక్కడి సిబ్బంది సంబంధిత నగరాలు, పట్టణాలకు కాల్స్ కనెక్ట్ చేస్తారు. కాల్స్ వివరాలు సేకరించేందుకు 3 నుంచి 4 వేల మంది ఉద్యోగులు 24 గంటల పాటూ పనిచేస్తుంటారు. కాగా, ఈ నంబర్ అందుబాటులోకి వస్తే రోజుకు 10 లక్షల కాల్స్ రావచ్చని అంచనా. ల్యాండ్ లైన్, మొబైల్ లతో పాటు ఓ ప్రత్యేక యాప్ ద్వారా కూడా 112కు ఫిర్యాదులు పంపే సదుపాయం దగ్గర కానుంది.