: బాహుబలి టికెట్ల కోసం 'ప్రసాద్స్' వద్ద కిలోమీటరు మేర క్యూ


తెలుగు సినీ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న 'బాహుబలి' చిత్రం టికెట్లను హైదరాబాదులోని 'ప్రసాద్స్' నేటి ఉదయం విక్రయానికి ఉంచింది. చిత్రాన్ని మొదటి రోజునే చూడాలన్న ఆశతో భారీ సంఖ్యలో అభిమానులు టికెట్ల కోసం రావడంతో కిలోమీటరు మేరకు క్యూ ఏర్పడింది. సినిమా టికెట్ల కోసం యువతీ యువకులు పోటీ పడుతున్నారు. టికెట్లను సొంతం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పురుషుల క్యూ ప్రసాద్స్ ఐమాక్స్, ప్యారడైజ్ రెస్టారెంట్ మీదుగా పాస్ పోర్ట్ వెరిఫికేషన్ సెల్ కార్యాలయాన్ని దాటిపోగా, మహిళల క్యూ ఇందిరా సర్కిల్ వరకూ ఉంది. అందుబాటులో ఉన్న అన్ని టికెట్లనూ నేడు విక్రయిస్తామని ప్రసాద్స్ ఐమాక్స్ నిర్వాహకులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News