: పాకిస్థాన్ సిరీస్ నెగ్గింది... టీమిండియా పడిపోయింది!


ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ ఐదోస్థానానికి పడిపోయింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ ను పాకిస్థాన్ కైవసం చేసుకోవడం భారత్ ర్యాంకు పతనానికి కారణమైంది. 3 టెస్టుల సిరీస్ ను 2-1తో నెగ్గిన పాక్ టీమ్ ర్యాంకుల్లో మూడోస్థానానికి ఎగబాకింది. దాంతో, నాలుగో స్థానంలో ఉన్న భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ జట్టు నాలుగో ర్యాంకు దక్కించుకుంది. భారత్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే ఉన్నాయి.

  • Loading...

More Telugu News