: జాతీయ గీతంలోని 'అధినాయక' పదంపై రాజస్థాన్ గవర్నర్ అభ్యంతరం
విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ రచించిన 'జన గణ మన...' గీతం భారత జాతీయ గీతంగా కొనసాగడం తెలిసిందే. కాగా, ఈ గీతంలోని తొలి పంక్తిలో వచ్చే 'అధినాయక' పదంపై రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదం బ్రిటీష్ శాసనాధికారాన్ని సూచిస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జైపూర్ లో రాజస్థాన్ విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'అధినాయక' అన్న పదాన్ని తొలగించి, ఆ స్థానంలో 'మంగళ' అనే పదాన్ని చేర్చాలని సూచించారు. 'జన గణ మన మంగళ జయహే' అని పాడుకోవాలని వివరించారు.