: రామ్ చరణ్ విమానాలకు కేంద్ర విమానయాన శాఖ అనుమతులు


సినీ హీరో రామ్ చరణ్ విమానాలు ఇక ఆకాశంలో ఎగరడానికి సిద్ధమవుతున్నాయి. ఆయనకు చెందిన 'టర్బో మెగా ఎయిర్ వేస్'కు కేంద్ర విమానయానశాఖ అన్ని అనుమతులు ఇచ్చినట్టు ఆ శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఢిల్లీలో తెలిపారు. చరణ్ సంస్థ ఇక తమ విమానాలను దేశవ్యాప్తంగా నడుపుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. గతేడాది జులైలో టర్బో మెగా ఎయిర్ వేస్ ను ప్రాంతీయ సంస్థగా గుర్తించారు. ఇప్పుడు జాతీయ సంస్థగా గుర్తింపు ఇస్తూ విమానయాన శాఖ అనుమతులు జారీ చేసింది. కాగా గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి చరణ్ విమాన సర్వీసులు నడవనున్నాయి.

  • Loading...

More Telugu News