: పంజాబీ స్టయిల్లో షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ వివాహం
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. ఢిల్లీ శివారులోని ఛాతర్ పూర్ ఫామ్ హౌస్ లో పంజాబీ సంప్రదాయంలో మీరా రాజ్ పుత్ ను పెళ్లి చేసుకున్నాడు. కేవలం ఇరువైపుల కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహం ఉదయం 11 గంటలకు చాలా సింపుల్ గా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం గుర్గావ్ లోని ఒబెరాయ్ హోటల్లో పెళ్లి విందు జరగనుంది. దాదాపు 500 మంది అతిథులు ఈ విందుకు హాజరవుతారని సమాచారం. మరోపక్క ఈ నెల 12న ముంబయ్ లో బాలీవుడ్ సెలబ్రిటీలు, స్నేహితులకు షాహిద్ జంట గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనుందట.