: ప్రశ్నిస్తానన్న వ్యక్తి భజన చేస్తున్నారు... పవన్ కల్యాణ్ పై ఎంపీ సుమన్ ధ్వజం


ప్రశ్నిస్తానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... భజన చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఎంపీలను టార్గెట్ చేసిన పవన్... చంద్రబాబును సూటిగా ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ఏదో ప్యాకేజీ తీసుకుని మాట్లాడినట్టు పవన్ కల్యాణ్ ప్రసంగం ఉందని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో, టీకాంగ్రెస్ నేతలపై కూడా సుమన్ విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అత్యున్నత పథంలో నిలపడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని... ఈ సమయంలో నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలపై ఉందని అన్నారు. మంచి సలహాలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News