: 'డోంట్ టచ్ మీ' అంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా?: జగన్


ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కోట్లు కుమ్మరించిందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. లంచాల సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేశారని విమర్శించారు. ఈ దారుణాలకు పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, కుట్రతో భూమా నాగిరెడ్డిపై కేసు పెట్టారని మండిపడ్డారు. కన్న కూతురుని దుర్భాషలాడితే ఏ తండ్రీ తట్టుకోలేడని... భూమా నాగిరెడ్డి కూడా అదే చేశారని... ఆ సమయంలో భూమను నెట్టేశారని... తనను నెట్టవద్దని చెప్పే క్రమంలో 'డోంట్ టచ్ మీ' అని అంటే ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించారని అన్నారు. చివరకు భూమాకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించాలని భూమా కోరినా... కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స చేయిస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News