: ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం... వచ్చే నెల జీతాలివ్వడం కూడా కష్టమేనట!


తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. మరి, అలాంటి ధనిక రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. వచ్చే నెల ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం కష్టమేనని చెబుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ బెవరేజెస్ కు చెందిన సుమారు రూ. 1,270 కోట్ల రూపాయలను ఆదాయపు పన్ను శాఖ రిజర్వ్ బ్యాంక్ ఖాతా నుంచి తీసేసుకుంది. దీంతో, తెలంగాణలో నిధుల కొరత ఏర్పడింది. ఇదే విషయమై టీఎస్ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలసి చర్చించడం కూడా జరిగింది. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అరుణ్ జైట్లీ ఆ తర్వాత పట్టించుకున్నట్టు లేదు. దీంతో, ఎక్కడి సమస్య అక్కడే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో, టీఎస్ ప్రభుత్వంలో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోందని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో మద్యంపై వచ్చిన ఆదాయానికి సంబంధించిన పన్నును ఐటీ శాఖ లాగేసుకుంది. అయితే, ఈ ఆదాయాన్ని తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి తీసుకోవడం టీఎస్ ప్రభుత్వానికి సమస్యగా మారింది.

  • Loading...

More Telugu News