: సండ్ర అరెస్టుకు నిరసనగా సత్తుపల్లిలో బంద్


ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టుకు నిరసనగా సత్తుపల్లిలో బంద్ కు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొంతమంది టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు సండ్ర అరెస్టును పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు.

  • Loading...

More Telugu News