: మద్దతిస్తే విమర్శలు సహించాలా? పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు బాబు అనుమతి కోరిన టీడీపీ నేతలు
ఎన్నికల్లో మద్దతిచ్చినంత మాత్రాన పవన్ కల్యాణ్ విమర్శిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను, జపాన్ పర్యటనలో ఉన్న బాబు దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నేతలు, ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. తాము వ్యాపారాలు చేసుకుంటున్నామని పవన్ చులకనగా మాట్లాడారని కొందరు దేశం ఎంపీలు బాబుకు ఫిర్యాదు చేశారు. మీరు అనుమతిస్తే తాము సైతం ప్రెస్ మీట్ పెడతామని తెలిపారు. కాగా, దీనిపై స్పందించిన బాబు, తాను వచ్చిన తరువాత పరిస్థితి సమీక్షిస్తానని, అప్పటివరకూ సంయమనం పాటిస్తూ, వేచిచూడమని సలహా ఇచ్చినట్టు సమాచారం.