: ఇక మొత్తం డబ్బివ్వరు... తగ్గనున్న పీఎఫ్ విత్ డ్రా పరిమితి!


వేతన జీవులు తమ పదవీ విరమణ తరువాత ఆర్థిక కష్టాలు అనుభవించరాదన్న సదుద్దేశానికే పీఎఫ్ నిధి ఉపయోగపడాలి తప్ప, దాన్ని మరో కారణానికి వినియోగించడం సరికాదని భావిస్తున్న కేంద్రం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఉద్యోగ భవిష్య నిధిలో పదవీ విరమణకు ముందు విత్ డ్రా చేసుకునే మొత్తాన్ని గరిష్ఠంగా 75 శాతానికి పరిమితం చేయాలని భావిస్తున్నట్టు ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలన్ తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి అనుమతి కోరుతూ, కార్మిక శాఖకు పంపినట్టు వివరించారు. గృహ నిర్మాణం, పెళ్లి, పిల్లల చదువు తదితర కారణాల నిమిత్తం ఈ 75 శాతం పరిమితి వర్తిస్తుందని, మిగతా 25 శాతం పదవీ విరమణ వరకూ పీఎఫ్ ఖాతాలోనే ఉంటుందని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం రెండు నెలలుగా తమకు ఉద్యోగం లేదన్న కారణం చూపుతూ, పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News