: డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ జేమ్స్ ఫాల్కనర్...ఆసీస్ క్రికెటర్ ను అరెస్ట్ చేసిన బ్రిటన్ పోలీసులు
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యుడు జేమ్స్ ఫాల్కనర్ డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. శనివారం రాత్రి మోతాదుకు మించి మద్యం సేవించిన అతడు వాహనం నడుపుతూ బ్రిటన్ లోని గ్రేట్ మాంచెస్టర్ లో పోలీసులకు దొరికిపోయాడు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో ఫాల్కనర్ నిర్ణీత మోతాదు కంటే రెండింతలు ఎక్కువగా మద్యం సేవించినట్లు తేలింది. దీంతో మాంచెస్టర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇంగ్లండ్ జట్టుతో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ఆడేందుకు బ్రిటన్ లో కాలుమోపిన ఆస్ట్రేలియా జట్టులో ఫాల్కనర్ కూడా ఉన్నాడు. డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఫాల్కనర్ ఈ నెల 21న బ్రిటన్ కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఫాల్కనర్ పై క్రికెట్ ఆస్ట్రేలియా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.