: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ ను వివాహమాడనున్న ఆసీస్ మహిళా జట్టు వైస్ కెప్టెన్
పలు దేశాల్లో గే, లెస్బియన్ వివాహాలకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. దాంతో, ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి. తాజాగా, క్రికెట్ ప్రపంచంలోనూ ఓ జంట వివాహానికి తహతహలాడుతోంది. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలెక్స్ బ్లాక్ వెల్ (31), ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ లిన్సే ఆస్క్యూ (28) ఒక్కటయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహాలు ఇంకా చట్టబద్ధం కాకపోవడంతో వీరి పెళ్లి యూకేలో జరగనుంది. బ్లాక్ వెల్ ఆస్ట్రేలియా జట్టుకు వైస్ కెప్టెన్ కాగా, ఆస్క్యూ 8 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడింది. భవిష్యత్తు దిశగా ఎంతో ఉత్సుకతతో ఉన్నామని బ్లాక్ వెల్ పేర్కొంది. తమ దేశంలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం కాకపోవడం పట్ల తానెంతో నిరాశ చెందుతున్నట్టు తెలిపింది.