: రష్యాలో భారత, పాక్ ప్రధానుల భేటీ


పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై పదిన రష్యాలో సమావేశం కానున్నారు. రష్యాలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు వీరిద్దరూ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రధానులు సమావేశం కానున్నారు. కాగా, ప్రధాని మోదీ ఆరు దేశాల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. నేడు ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్ చేరుకున్న మోదీ, రేపు కజికిస్థాన్ వెళ్లనున్నారు. అనంతరం జూలై 8న రష్యాకు పయనమవనున్నారు. గతేడాది నేపాల్ లో రాజధాని ఖాట్మాండూలో జరిగిన సార్క్ దేశాల సదస్సు సందర్భంగా మోదీ, షరీఫ్ కలుసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News