: గ్రీస్ ఆర్థిక మంత్రి రాజీనామా
గ్రీస్ లో వ్యయ నియంత్రణ చర్యలపై చేపట్టిన రెఫరెండమ్ అనంతరం ఆ దేశ ఆర్థిక మంత్రి యూనిస్ వరౌఫకిస్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రెఫరెండమ్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై యూరోజోన్ నేతలతో చర్చించడానికి ముందే ఆయన రాజీనామా చేశారు. యూరోజోన్ లోని ఇతర దేశాలతో జరిగిన చర్చల్లో పాల్గొనేందుకు యూనిస్ వ్యవహార శైలి అడ్డంకిగా ఉందని వార్తలు వెలువడడంతో, గ్రీస్ ప్రధాని ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు. గ్రీస్ సంక్షోభంపై చేపట్టిన రెఫరెండమ్ లో ప్రజలు గ్రీస్ ప్రధాని సిప్రాస్ కు మద్దతుగా నిలిచారు. యూరో జోన్ నేతలు పెట్టిన షరతులకు ప్రజలు అంగీకరించలేదు. దీంతో గ్రీస్ తనకు అప్పులిచ్చిన ఆర్థిక సంస్థలు, దేశాలకు ఎగవేతదారుగా మారిపోయింది.