: క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన సానియా, హింగిస్ జోడి
వింబుల్డన్ లో మహిళల డబుల్స్ విభాగంలో భారత్ కు చెందిన సానియా మీర్జా, స్విస్ స్టార్ మార్టీనా హింగిస్ జోడీ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. నేడు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్ లో సానియా, హింగిస్ జోడీ, స్పెయిన్ డబుల్స్ క్రీడాకారిణులు అరెంటా పార సాంటాన్జియా, అనబెల్ మెడీనా గ్యారగన్ లపై 6-3, 6-4 తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ జంట క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించింది. కాగా, సానియా మీర్జా 2008లో క్వార్టర్స్ నుంచి, 2011లో సెమీస్ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే.