: తెలంగాణలో తిరిగి పుంజుకున్న తెలుగుదేశం: నారా లోకేశ్ ట్వీట్


తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో పలువురు టీడీపీ అభ్యర్థులు గెలుపొందడంపై నారా లోకేష్ ట్వీట్టర్ లో స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ తిరిగి పుంజుకుందని సంతోషం వ్యక్తం చేశారు. "తెలంగాణలో టీడీపీ తిరిగి పుంజుకుంది. మంచి మెజారిటీతో ముగ్గురు ఎంపీటీసీలు గెలుపొందారు. ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. అది కేవలం టీడీపీతోనే సాధ్యమవుతుంది" అని లోకేశ్ ట్వీట్ చేశారు. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మూడు ఎంపీటీసీలకు నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో టీడీపీ హవా కొనసాగింది.

  • Loading...

More Telugu News