: శేషాచలం ఎన్ కౌంటర్ పై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు తిరస్కరణ


ఈ ఏడాది తిరుపతిలోని శేషాచలం అటవీప్రాంతంలో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్ కౌంటర్ పై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు నిరాకరించింది. బాధితుల కుటుంబాలు న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఎన్ కౌంటర్ నకిలీ అనేందుకు మీ వద్ద ఉన్న ఆధారాలేంటని అర్జీదారులను ప్రశ్నించింది. ఈ కేసును తమ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్నందున సీబీఐ దర్యాప్తు అవసరంలేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కేసు దర్యాప్తును మరో మూడు వారాల్లోగా పూర్తి చేయాలని సిట్ ను కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News