: విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ... ఆరు దేశాల్లో పర్యటన
రష్యాతో పాటు ఆరు దేశాల పర్యటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీ నుంచి ఉజ్బెకిస్థాన్ కు బయలుదేరి వెళ్లారు. తొలుత ఉజ్బెక్ లో కాలుమోపనున్న నరేంద్ర మోదీ, అక్కడ తన పర్యటనను ముగించుకుని కజకిస్థాన్, ఆ తర్వాత రష్యా బయలుదేరతారు. రష్యా పర్యటన సందర్భంగా ఆ దేశంతో భారత్ సంబంధాల పటిష్ఠతకు సంబంధించి నరేంద్ర మోదీ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. బ్రిక్స్ సమావేశాల్లోనూ ప్రధాని పాలుపంచుకుంటారు. అనంతరం తుర్కుమెనిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్ దేశాల్లోనూ పర్యటిస్తారు. నేటి నుంచి ఈ నెల 12 దాకా ఆ దేశాల్లో పర్యటించనున్న మోదీ, 13న స్వదేశం బయలుదేరతారు.