: కోహ్లీ సారథ్యంలో టీమిండియాకు ఉజ్వల భవిష్యత్తు: విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అతడు వ్యాఖ్యానించాడు. జట్టు వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలిస్తే విభిన్నంగా ఉండే కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ అత్యున్నత శిఖరాలకు చేరనుందని కూడా రిచర్డ్స్ అన్నాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరించే కోహ్లీ, మ్యాచ్ నాణ్యతను పెంచేస్తాడని పేర్కొన్నాడు. దూకుడుగా ఉంటూనే కోహ్లీ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడని కితాబిచ్చాడు. కోహ్లీ బ్యాటింగ్ శైలి కూడా అద్భుతమని వివ్ రిచర్డ్స్ ప్రశంసించాడు.

  • Loading...

More Telugu News