: చంద్రబాబుకు మోదీ ఫోన్...కేబినెట్ భేటీ నుంచి బయటకు వచ్చి మాట్లాడిన ఏపీ సీఎం


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. నిన్న ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుండగా, ప్రధాని నుంచి ఫోన్ కాల్ రావడంతో చంద్రబాబు సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. ప్రధానితో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఆయన తిరిగి సమావేశానికి హాజరయ్యారు. తన జపాన్ పర్యటనను మోదీకి తెలపడంతో పాటు, పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు రావాలని మోదీని ఆహ్వానించేందుకు అంతకుముందే తాను ఫోన్ చేశానని, అయితే అప్పుడు బిజీగా ఉన్న ప్రధాని తన ఫోన్ కాల్ కు రెస్పాండ్ కాలేదని చంద్రబాబు తన కేబినెట్ సహచరులకు చెప్పారు. తన ఫోన్ కాల్ సమాచారం తెలుసుకున్న మోదీ, ఆ తర్వాత ఆయనే తనకు ఫోన్ చేశారని కూడా వివరించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం శంకుస్థాపనకు వచ్చేందుకు ప్రధాని అంగీకరించారని కూడా చంద్రబాబు మంత్రులకు తెలిపారు.

  • Loading...

More Telugu News