: ఏం మనుషులు...శవం దగ్గర కూడా సెల్ఫీలా?: అమితాబ్ ఆగ్రహం
సెలబ్రిటీలకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. వారు ఎక్కడ కనపడినా అభిమానులు వారితో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తారు. సెల్ఫీల యుగం నడుస్తుండడంతో ఈ మధ్య కాలంలో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. అభిమానుల ఆదరణను ఆస్వాదించే నటీనటులు కూడా కొన్ని సార్లు వారి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారు. తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ను అభిమానులు తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా అభిమానులు ఏం కోరినా అమితాబ్ కాదనరు. అభిమానులంటే ఆయనకు అంత గౌరవం. అలాంటి అమితాబ్ తన స్నేహితుడు అకస్మాత్తుగా మృతి చెందితే, అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. స్నేహితుడు దూరమైన బాధలో ఆయనుంటే, అభిమానులు ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారట. దీంతో అమితాబ్ కు ఆగ్రహం ముంచుకొచ్చింది. ఏం మనుషులు...శవం దగ్గర కూడా సెల్ఫీలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి కనీసం గౌరవం ఇవ్వడం లేదని ఆయన తన ఫేస్ బుక్ పేజ్ లో ఆవేదన వ్యక్తం చేశారు.