: వికలాంగుల కోసం పనిచేస్తానన్న సివిల్స్ టాపర్... ఆమె కూడా ఓ వికలాంగురాలే!
నేడు విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఇరా సింఘాల్ టాప్ ర్యాంకును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వికలాంగుల కోసం తాను కృషి చేస్తానని అన్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఆమె కూడా వికలాంగురాలే. వైకల్యాన్ని సైతం ఎదిరించిన ఆమె... దేశంలోనే అత్యున్నత పరీక్షలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్ గత సివిల్స్ లో ఐఆర్ఎస్ కు సెలెక్ట్ అయ్యారు. అయితే, మరింత శ్రమించి ఈరోజు తన టార్గెట్ ను చేరుకోగలిగారు. సివిల్స్ లో టాపర్ గా నిలుస్తానని తాను ఊహించలేదని... ఈ విజయం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఆమె తెలిపారు.