: కన్నబిడ్డకు తాళికట్టిన మృగాడు... ఊచలు లెక్కిస్తున్నాడు
సొంత కూతురికి తాళికట్టి, సమాజానికి తన రెండవ భార్యని చెబుతూ కాపురం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అమానుష ఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన 12 ఏళ్ల కూతురికి తాళి కట్టిన ఓ కసాయి తండ్రి గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అతని దారుణంపై ఫిర్యాదు చేసేందుకు భార్య కూడా ధైర్యం చేయలేకపోయింది. దీన్ని బయటకు చెబితే చంపేస్తానని భయపెట్టి చిత్రహింసలకు గురిచేసేవాడు. విషయాన్ని గమనించిన ఇరుగు-పొరుగువారు చైల్డ్ లైన్ సంరక్షణ అధికారులకు, పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.