: టీఆర్ఎస్ పడవ బరువెక్కింది... మునిగిపోయే ప్రమాదముంది: సీపీఐ నారాయణ


ఇతర పార్టీల నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతుండటంతో టీఆర్ఎస్ పడవ బరువెక్కిందని సీపీఐ నేత నారాయణ అన్నారు. దాంతో ఆ పార్టీ పడవ మునిగిపోయే ప్రమాదముందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు నిరంతరం ప్రజల మధ్య ఉండాలన్న నారాయణ, బట్ట కాల్చి ప్రజల మీద వేసి ఫాంహౌస్ లో ఉండటం కేసీఆర్ కే చెల్లిందని విమర్శించారు. రాష్ట్రపతి కాళ్లకు మొక్కడం కాదని, రాష్ట్రపతి సలహాలు పాటించాలని కోరారు.

  • Loading...

More Telugu News