: స్నాప్ డీల్ లో చూసి రూ. 6 కోట్లతో ఇంటిని కొనేశాడు!
ఈ-కామర్స్ రంగం ఎంతగా విస్తరిస్తోందో తెలియడానికి ఇంకో ఉదాహరణ ఇది. 'మంత్రి డెవలపర్స్'తో చేసుకున్న డీల్ లో భాగంగా బెంగళూరు నగరంలోని ఓ పెంట్ హౌస్ ను స్నాప్ డీల్ అమ్మకానికి ఉంచింది. దీన్ని ఆన్ లైన్లో చూసిన ఓ వ్యక్తి రూ. 6 కోట్లు చెల్లించి కొనుగోలు చేశాడు. మంత్రి డెవలపర్స్ జరిపిన ఆన్ లైన్ లావాదేవీల్లో ఇదే అత్యధికం. బెంగళూరులో తాము చేపట్టిన 'మంత్రి ఎస్పానా' ప్రాజెక్టులో భాగంగా ఈ డీల్ జరిగిందని మంత్రి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ మంత్రి తెలిపారు. ప్రీమియం ప్రాపర్టీలను ఆన్ లైన్లో విక్రయించాలని భావిస్తున్నామని, అందుకు మంచి స్పందన వస్తోందని ఆయన అన్నారు.