: సౌదీలో ఘోరం: ఐదుగురు భారతీయులు మృతి


సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతిచెందారు. ఈ ఘటన దమ్మమ్‌ పరిధిలో జరిగింది. సౌదీలోని భారత దౌత్య కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్న కేరళ వాసులు సంతోష్‌ కుమార్, ఇక్బాల్ నోమన్, తులసీ కృష్ణన్, రవీంద్ర నాయర్, శివకుమార్ లు విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వీరంతా అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతదేహాలను ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News