: ప్రియాంకకు ఆఫర్ వస్తే చెల్లిని సిఫారసు చేసింది!


బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటించే ఆఫర్ వస్తే ఎవరైనా సరే ఎగిరిగంతేసి ఒప్పుకుంటారు. కానీ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అలా చేయలేదు. ఈ సినిమా ఆఫర్ తన చెల్లెలు పరిణీతి చోప్రాకి సిఫారసు చేసింది. ఈ ఏడాది ఈద్ కానుకగా 'బజరింగీ భాయ్ జాన్' సినిమాను అభిమానుల ముందుకు తెస్తున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్, వచ్చే ఈద్ కు 'సుల్తాన్' విడుదల చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ సరసన నటించేందుకు నిర్మాతలు ప్రియాంకను సంప్రదించగా, పరిణీతికి అవకాశమివ్వమని చెప్పింది. అయితే సల్మాన్ సరసన పరిణీతి చోప్రా సరిపోతుందో లేదోనని దర్శకుడు అబ్బాస్ సందేహిస్తున్నాడట. బాలీవుడ్ యువ నటుల సరసన నటించిన పరిణీతి చోప్రా ఇంత వరకు బడా హీరోల సరసన నటించలేదు. దీంతో స్టార్ డమ్ ఉన్నా, సోనాక్షి సిన్హా, అలియా భట్, శ్రధ్ధా కపూర్ లతో రేసులో వెనుకబడింది. రేసులో ముందుకు రావాలంటే హిట్ సినిమా అయినా ఉండాలి, లేదా సల్మాన్ తో సినిమా అయినా ఉండాలి. అందుకే ప్రియాంక సల్లూభాయ్ సరసన చెల్లిని నిలబెట్టాలని ప్రయత్నిస్తోందని బాలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది.

  • Loading...

More Telugu News