: పిచ్చికిదే పరాకాష్ట... తాత మృతదేహంతో మనవడి సెల్ఫీ


యువతలో సెల్ఫీల పిచ్చి పరాకాష్టకు చేరింది. కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్న సెల్ఫీలు జుగుప్స కలిగిస్తున్నాయంటే సందేహం లేదు. ఇది కూడా అటువంటిదే. సౌదీ అరేబియాకు చెంది ఓ నెట్ ప్రియుడు తన తాత మృతదేహం వద్ద నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ, సెల్ఫీ తీసుకొని, దాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సదరు యువకుడి విచిత్ర హావభావాలను, శుభాశుభాలకు తేడా తెలియని వైనాన్ని చూసి షాక్ కు గురైన నెటిజన్లు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సెల్ఫీ పక్కన 'గుడ్ బై గ్రాండ్ ఫాదర్' అని ట్యాగ్ కూడా పెట్టాడు. ఈ ఘటనపై సౌదీ అధికారులు విచారణకు ఆదేశించారు. తాత మృతదేహంతో దిగిన సెల్ఫీ ఆ కుర్రాడి వెర్రితనం, అతనికి జైలును పరిచయం చేస్తుందని సమాచారం.

  • Loading...

More Telugu News