: మరో దేశంలో మ్యాగీ నూడుల్స్ అమ్మకాలకు అనుమతి


భారతదేశంలో నిషేధానికి గురైన మ్యాగీ నూడుల్స్ అమ్మకాలకు విదేశాల్లో అనుమతులు లభిస్తున్నాయి. ఇటీవల మ్యాగీ ఉత్పత్తులకు బ్రిటన్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వగా, తాజాగా కెనడా కూడా అనుమతి ఇచ్చింది. ఇప్పటికే తీవ్ర కష్టాల్లో ఉన్న నెస్లే సంస్థకు తాజా నిర్ణయం ఉపశమనం కలిగించే విషయమని చెప్పాలి. మ్యాగీ ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం కాదని కెనడా ఆహార తనిఖీ సంస్థ (సీఎఫ్ఐఏ) వెల్లడించింది. కొన్ని మ్యాగీ శాంపుల్స్ ను ప్రయోగశాలలో పరీక్షించిన తరువాత సీఎఫ్ఐఏ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. మరోవైపు సింగపూర్ ప్రభుత్వం కూడా మ్యాగీ నూడుల్స్ సురక్షితమని ప్రకటించింది.

  • Loading...

More Telugu News