: 'హౌ డేర్ యూ టు టాక్ టు మై డాటర్' పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయిన భూమా!


కర్నూలు జిల్లా పోలీసులపై వైకాపా నేత భూమా నాగిరెడ్డి విరుచుకుపడ్డారు. తన కూతురిని వెళ్లమని చెప్పడానికి మీరెవరని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనల పుస్తకం చూపాలని గద్దించారు. 'హౌ డేర్ యూ టు టాక్ టు మై డాటర్' అని ఊగిపోయారు. ఈ ఘటన నంద్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగింది. అంతకుముందు తనను పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లమని చెప్పిన పోలీసులపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన భూమా కోపంతో పోలీసులను నిలదీశారు. పోలీసులు వివక్ష ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. తాము కేవలం ఎమ్మెల్యేను టెంటు కింద కూర్చోవాలని మాత్రమే కోరామని, వెళ్లిపొమ్మని చెప్పలేదని పోలీసు ఉన్నతాధికారులు నాగిరెడ్డికి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News