: రేవంత్ తరపున బరిలోకి దిగిన రాంజెఠ్మలానీ
సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి బెయిలును రద్దు చేయాలని ఏసీబీ వేసిన పిటీషనుపై మరికాసేపట్లో వాదనలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి తరపున వాదించేందుకు ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ వకాల్తా పుచ్చుకున్నారు. ఆయన కోర్టుకు రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటికే తెలంగాణ ఏసీబీ తరపున వాదించేందుకు కపిల్ సిబల్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇద్దరు దిగ్గజ లాయర్లు తమ వాదనలు కోర్టు ముందు ఎలా వినిపిస్తారు? ఎవరు న్యాయమూర్తిని కన్విన్స్ చేయగలుగుతారు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.