: సామూహిక అత్యాచారం కేసులో 'ABCD 2' నటుడి అరెస్ట్
మతిస్థిమితం లేని 14 సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన కేసులో ఇటీవలి సూపర్ హిట్ చిత్రం ‘ABCD 2’ నటుడు నీలేష్ నిర్భావనేను ముంబయ్, పంత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్భావనేతో పాటు ఆయన స్నేహితుడుని కూడా నిందితుడిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి వ్యవహార శైలి, ప్రవర్తనలో మార్పు గమనించిన టీచర్ అత్యాచారం జరిగిందని గుర్తించి, ఆమె తల్లిదండ్రులకు, ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన స్నేహితుడితో కలసి బాధితురాలిని ఎవరూ లేని ప్రాంతాలకు, టాయిలెట్లలోకి తీసుకువెళ్లిన నిర్భావనే పలుమార్లు ఘోరానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని అతను విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు పెట్టామని వివరించారు. కాగా, 'ABCD 2' చిత్రంలో అద్భుత నృత్య ప్రదర్శనలు చూపిన టీంలో నీలేష్ సభ్యుడిగా నటించాడు.