: స్కూలు బస్సుపై తెగిపడ్డ విద్యుత్ తీగలు... 18 మంది చిన్నారులకు కరెంట్ షాక్
నిండా పాఠశాల విద్యార్థులతో బయలుదేరిన ఓ బస్సుపై ఊహించని విధంగా విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో బస్సులోని 18 మంది విద్యార్థులతో పాటు అందులోని ఉపాధ్యాయులు కూడా విద్యుత్ షాక్ కు గురయ్యారు. రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో నేటి ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఊహించని ఈ ప్రమాదంలో గాయపడ్డవారిలో నలుగురు విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.