: సొంత జట్టును ఓడించిన ఇంగ్లండ్ క్రీడాకారిణి... తీవ్ర విమర్శలు
మహిళల ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీల ఫైనల్లోకి ప్రవేశించాలన్న ఇంగ్లండ్ కల నెరవేరలేదు. మరో 3 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆ దేశ క్రీడాకారిణి లారా బాసెట్ లక్షలాది మంది అభిమానుల ఆశలు నిరాశలు చేస్తూ, సొంత జట్టు ఓటమికి కారణమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్, జపాన్ జట్లు పోటీ పడగా, నిర్ణీత 90 నిమిషాల్లో 1-1తో స్కోరు సమంగా ఉంది. అదనంగా ఇచ్చిన ఇంజూరీ సమయం మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా, డిఫెండర్ బాసెట్ సెల్ఫ్ గోల్ చేసి జట్టు పయనానికి బ్రేక్ వేసింది. దీంతో 2-1తో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ మళ్లీ ఫైనల్ చేరింది. దీంతో బాసెట్ ను అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా, ఆదివారం తుదిపోరులో వరుసగా రెండోసారి అమెరికానే జపాన్ ఢీకొట్టబోతోంది.