: హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ సీఎం అత్యాధునిక బస్సు
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక బస్సు సిద్ధమైంది. చండీగఢ్ లో తయారైన ఈ బస్సును ఈ రోజు నగరానికి తీసుకొచ్చారు. బస్సు తయారీకి మొత్తం రూ.5 కోట్లు ఖర్చయింది. రాత్రిపూట బస చేసేందుకు కూడా వీలుగా ఈ బస్సులో హైసెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. అంతేగాక బస్సులో అత్యాధునిక హంగులు కూడా ఉన్నాయి. సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు, వైఫై సౌకర్యం, అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అయితే కావల్సిన ఏర్పాట్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాతే బస్సును సీఎంకు అందుబాటులోకి తీసుకెళతారని అంటున్నారు.