: బీహార్లో 1400 మంది టీచర్ల రాజీనామా... నకిలీ సర్టిఫికెట్ల ఎఫెక్ట్
నకిలీ సర్టిఫికెట్లతో బీహార్ లో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలు సంపాదించిన వారు బెంబేలెత్తిపోతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్న భయంతో ఇప్పటికే 1400 మంది టీచర్లు రాజీనామా చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు తమంతట తాముగా రాజీనామా చేయాలని... లేకపోతే కఠిన చర్యలు తప్పవని పాట్నా హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఈనెల 8లోగా అలాంటి ఉద్యోగులంతా రాజీనామా చేయాలని అధికారులు గడువు విధించారు. ఈ నేపథ్యంలో, రానున్న రోజుల్లో మరింత మంది రాజీనామా చేసే అవకాశం ఉందని బీహార్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు.