: కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద పేలుడు!
కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఈ మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొగిలిపాలెంకు చెందిన దుర్గయ్య అనే చెత్త ఏరుకునే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రి వెనుక గేటు వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో కొన్ని కేబుల్ వైర్లు ఉండడంతో, అవి అంటుకున్నాయా? లేదా ఏదైనా బాంబు పేలిందా? అన్న కోణంలో విచారణ సాగుతోంది. పేలుడు సమయంలో పెద్ద శబ్దం, వెలుగు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.