: చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అపోలోకు కట్టబెట్టనున్న ఏపీ సర్కారు!


చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని వాడుకుని ప్రైవేటు వైద్య కళాశాలను నిర్వహించేందుకు అపోలో గ్రూప్ కు ఏపీ సర్కారు అనుమతులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం మెమోను (నంబర్ 5735/డీ1/2015, తేదీ: 30-06-2015) తయారు చేసింది. మే 20న అపోలో హాస్పిటల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యదర్శి నుంచి, ప్రభుత్వ ఆసుపత్రిని కేటాయించాలని లేఖ రాగా, దాని ఆధారంగా 40 రోజుల్లోనే జీవో జారీకి రంగం సిద్ధమైంది. 300 పడకలు, రోజూ 600 మందికి పైగా ఔట్ పేషంట్లతో బిజీగా ఉండే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని క్లినికల్ అటాచ్ మెంటు పేరుతో వచ్చే సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు అపోలోకు ఆసుపత్రిని లీజుకిచ్చేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని వేసిన ఏపీ సర్కారు, ఆసుపత్రిని సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. రాష్ట్రంలో ఓ ప్రైవేటు వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకునే నిమిత్తం ప్రభుత్వాసుపత్రిని అప్పజెప్పడం ఇదే తొలిసారి. ఈ ఆస్పత్రిని ఇవ్వడంవల్ల 150 ఎంబీబీఎస్ సీట్లతో వచ్చే ఏడాది (2016) నుంచి వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా కన్వీనర్ కోటా కింద మిగిలే 75 సీట్లను ఒక్కోటి రూ. 1 కోటి చొప్పున కేటాయించుకున్నా, మూడేళ్లలో రూ. 225 కోట్ల ఆదాయం అపోలోకు లభించనుంది. కాగా, ఇదే తరహాలో క్లినికల్ అటాచ్ మెంట్ పేరిట మణిపాల్ లో ఓ ప్రభుత్వాసుపత్రిని లీజుకు తీసుకున్న ఓ కళాశాల 20 ఏళ్లయినా, ఇప్పటికీ వదల్లేదు. దీంతో మూడేళ్ల కాలపరిమితి పేరుకేనని, దాన్ని తదుపరి ఎంత కాలానికైనా పొడిగించుకునే వీలుందన్న విమర్శలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News