: ఎంపీలకు 100 శాతం జీతాలు పెంచాలని పార్లమెంటరీ ప్యానల్ సిఫారసు


పార్లమెంటు సభ్యులకు 100 శాతం జీతాలు పెంచాలని బీజేపీ ఎంపీ యోగా ఆదిత్యానాథ్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసినట్టు ఓ వార్తాపత్రిక పేర్కొంది. అంతేగాక ప్రజాప్రతినిధులకు ఇచ్చే పింఛన్ ను కూడా రూ.20,000 నుంచి రూ.50,000లకు పెంచాలని ఈ మేరకు సమర్పించిన నివేదికలో సిఫారసు చేసినట్టు తెలిపింది. ఈ క్రమంలో వేతన సంఘం తరహాలో ఒక వేతన సవరణ విధానం తీసుకురావాలని ఎంపీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్యానెల్ సూచించిందట. దాదాపు 60 సిఫారసులను ఎంపీ ప్యానెల్ ప్రతిపాదించిందని నివేదిక ద్వారా తెలిసింది. ఇదే క్రమంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు ప్రస్తుతం ఇచ్చే డైలీ అలవెన్సు రూ.2వేలను కూడా పెంచాలని ప్యానెల్ సలహా ఇచ్చిందట. ఇలా ఎంపీలకు ప్రభుత్వం ఇచ్చే పలు అలవెన్సులను పెంచాలని ప్యానెల్ సూచించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News