: వెకిలి చేష్టలు చేస్తూ 'షీ టీమ్స్' కి చిక్కిన వృద్ధుడు!


'షీ టీమ్స్' ఎంతగా శ్రమిస్తున్నా ఈవ్ టీజర్ల ఆగడాలు తగ్గడం లేదు. వయసుతో నిమిత్తం లేకుండా వేధిస్తున్న సందర్భాలూ వెలుగులోకి వస్తున్నాయి. ఒకడు తాకాలని చూస్తే, ఇంకొకడు కన్ను కొడతాడు, మరొకడు మాట్లాడాలని చూస్తాడు. పిచ్చి సైగలు, వెకిలి చేష్టలు చేస్తారు. పాపం పండితే వీరు షీటీమ్స్ కెమెరా కంటికి చిక్కుతారు. నిన్న ఒక్కరోజే నలుగురు ఈవ్ టీజర్లను షీటీమ్స్ పట్టుకుంది. వీరిలో 71 సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగి కూడా ఉండడం గమనార్హం. ఓ బస్టాపులో కూర్చొన్న మహ్మద్ సాదిక్ అలీ అక్కడి మహిళలను ముట్టుకుంటూ వీడియోకు చిక్కాడు. ఇతడికి రెండు రోజుల జైలు శిక్ష పడింది. మరో ఘటనలో అఫ్జల్ గంజ్ బస్టాపులో యువతిని ఆరు నెలలుగా వేధిస్తూ తాకాలని ప్రయత్నిస్తున్న రాములు అనే కార్మికుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టీమ్ కోర్టులో హజరు పరచగా ఐదు రోజుల శిక్ష పడింది. మెహిదీపట్నం బస్టాపులో మహిళకు కన్నుకొడుతూ చిక్కిన మహ్మద్ మొహిసిన్, అంబా థియేటర్ దగ్గర మహిళల భుజాలను తాకుతున్న ఇస్తాక్ లను వీడియో సాక్ష్యంతో షీ టీమ్స్ పట్టుకుని శిక్షలు వేయించింది.

  • Loading...

More Telugu News