: వావ్... ఇకపై వైట్ హౌస్ కు వెళితే ఫోటోలు తీసుకోవచ్చట!
వైట్ హౌస్... అమెరికా అధ్యక్ష నివాసం. ఇక్కడికి నిత్యమూ ఎందరో అతిథులు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి సందర్శకులు వచ్చి పోతుంటారు. వైట్ హౌస్ లో ఫోటోలు తీయడం నిషేధం. ఇది సుమారు 40 సంవత్సరాలుగా అమలవుతోంది. ఇప్పుడీ నిబంధన తొలగింది. వైట్ హౌస్ సందర్శకులను మరింత ఆనందింపజేసేందుకు 40 ఏళ్ల క్రితం విధించిన 'కెమెరాలపై నిషేధం'ను తొలగించినట్టు ఒబామా సతీమణి మిచెల్ తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాలు విస్తరించిన వేళ ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. దీంతో అందమైన వైట్ హౌస్, అందులోని అపురూప చిత్రాలు, విలువైన ఫర్మీచర్ అలంకరణలు ఇక సోషల్ మీడియాకు ఎక్కి వైట్ హౌస్ వెళ్లలేనివారిని కనువిందు చేస్తాయనడంలో సందేహం లేదు.