: సోషల్ మీడియాను వాడరాదంటూ ఫర్మానా జారీ చేసిన పెద్దలు


ప్రస్తుత కాలంలో ఎవరిని చూసినా ఏదో ఒక సోషల్ మీడియాతో అనుసంధానం అయి ఉంటున్నారు. దేశాధినేతలు కూడా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి సోషల్ మీడియానే ఉపయోగించుకుంటున్నారంటే... వాటి ప్రాధాన్యత ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. అయితే, అదే సోషల్ మీడియాను 'ఖాప్' పెద్దలు బహిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే, రాజస్థాన్ లోని బార్మెర్ జిల్లాలో బాలికలు, మహిళలు సోషల్ మీడియాను వాడరాదంటూ పెద్దలు ఫర్మానా జారీ చేశారు. అంతేకాదు, జీన్స్ కూడా ధరించరాదని ఆదేశించారు. పెళ్లి సమయంలో వరుడు కచ్చితంగా పంచె కట్టుకోవాలని, పెళ్లికూతురు గాగ్రా ధరించాలని సూచించారు. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు, ఖాప్ పెద్దల ఫర్మానా పట్ల ఆధునికవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News