: డీఎస్ కు పార్టీ చాలా చేసింది...పార్టీ వీడుతారని భావించడం లేదు: డిగ్గీరాజా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కు పార్టీ చాలా చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, డీఎస్ పార్టీ వీడుతారని తాను భావించడం లేదని అన్నారు. 'మీ వల్లే ఆయన పార్టీని వీడుతున్నారన్న వార్తలొస్తున్నాయి కదా?' అని అడిగితే, డీఎస్ విషయంలో తానేదైనా తప్పిదం చేసి ఉంటే, దానికి సోనియా గాంధీ చర్యలు తీసుకుంటారని అన్నారు. డీఎస్ ను పార్టీ వీడవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.