: మ్యాగీ నూడుల్స్ కు బ్రిటన్ లో ఊరట
విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్న మ్యాగీ నూడుల్స్ కు గొప్ప ఊరట లభించింది. భారతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు సరితూగక ఇక్కడ నిషేధానికి గురైన మ్యాగీ, యూరోపియన్ యూనియన్ భద్రతా ప్రమాణాలను అందుకోవడం విశేషం. మ్యాగీ నూడుల్స్ లో ఎలాంటి హానికారకాలు లేవని బ్రిటన్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో నెస్లే కంపెనీకి గొప్ప ఊరట లభించింది. మ్యాగీ తయారీలో స్థాయికి మించి హానికారకాలు వాడారని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రిటన్ ఆహార భద్రత సంస్థ భరోసా ఇచ్చింది. దీంతో, యూరోపియన్ దేశాలను మ్యాగీ నూడుల్స్ ముంచెత్తనున్నాయి.