: వరుణ్ గాంధీ తన పెద్దమ్మతో మాట్లాడి సెటిల్ చేస్తానన్నారు!: లలిత్ మోదీ
ఐపీఎల్ కుంభకోణానికి పాల్పడి దేశం వీడిన లలిత్ మోదీ బీజేపీని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పటికే సుష్మాస్వరాజ్, వసుంధర రాజేలను ఇరుకున పెట్టిన లలిత్ మోదీ, ఈసారి వరుణ్ గాంధీని తెరమీదికి తెచ్చారు. కొన్నేళ్ల క్రితం వరుణ్ గాంధీని లండన్ లో కలిశానని చెప్పిన లలిత్ మోదీ, బీసీసీఐ ఆరోపణలతో సీబీఐ విచారణ మొత్తం వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు ఆయన 60 మిలియన్ డాలర్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ మొత్తం ఇస్తే అప్పట్లో అధికారంలో ఉన్న ఏఐసీసీ చీఫ్, తన పెద్దమ్మ సోనియా గాంధీతో మాట్లాడతానన్నారని వెల్లడించారు. తాజా ట్వీట్ తో కాంగ్రెస్, బీజేపీలను తన చట్రంలోకి లాగాడు. దీనిపై ఆయా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.