: నకిలీ యూనివర్శిటీల జాబితా విడుదల చేసిన యూజీసీ


దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక సంస్థ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని నకిలీ యూనివర్శిటీల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 21 నకిలీ వర్శిటీలుండగా, వాటిలో 8 ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. మరో 6 నకిలీ వర్శిటీలు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాయి. మిగతా నకిలీ విశ్వవిద్యాలయాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇవన్నీ చట్టవిరుద్ధంగా ఏర్పాటై, కార్యకలాపాలు సాగిస్తున్నట్టు యూజీసీ గుర్తించింది. ఆ నకిలీ యూనివర్శిటీలు ఇవే... 1. మైథిలి యూనిర్శిటీ (బీహార్) 2. వరణ్ సేయ సంస్కృత్ విశ్వవిద్యాలయ (ఢిల్లీ) 3. కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్ (ఢిల్లీ) 4. యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ (ఢిల్లీ) 5. వొకేషనల్ యూనివర్శిటీ (ఢిల్లీ) 6. ఏడీఆర్-సెంట్రల్ జ్యూరిడికల్ యూనివర్శిటీ (ఢిల్లీ) 7. ఇండియన్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఢిల్లీ) 8. బదగ్నావి సర్కార్ వరల్డ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ (కర్ణాటక) 9. సెయింట్ జాన్స్ యూనివర్శిటీ (కేరళ) 10. కేశర్వాణి విద్యాపీఠ్ (జబల్పూర్-మధ్యప్రదేశ్) 11. రజా అరబిక్ యూనివర్శిటీ (మహారాష్ట్ర) 12. డీడీబీ సంస్కృత్ యూనివర్శిటీ (తమిళనాడు) 13. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (పశ్చిమ బెంగాల్) 14. మహిళా గ్రామ్ విద్యాపీఠ్ (ఉత్తరప్రదేశ్) 15. గాంధీ హిందీ విద్యాపీఠ్ (ఉత్తరప్రదేశ్) 16. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (ఉత్తరప్రదేశ్) 17. నేతాజి సుభాష్ చంద్రబోస్ యూనివర్శిటీ (ఉత్తరప్రదేశ్) 18. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ (ఉత్తరప్రదేశ్) 19. మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విద్యాలయ (ఉత్తరప్రదేశ్) 20. ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్ (ఉత్తరప్రదేశ్) 21. గురుకుల్ విశ్వవిద్యాలయ (ఉత్తరప్రదేశ్)

  • Loading...

More Telugu News