: రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెడుతుంటే ఉస్మానియా విద్యార్థికి అంటుకున్న మంటలు
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిలు మంజూరు కావడాన్ని నిరసిస్తూ, ఉస్మానియాలో చేపట్టిన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నంలో ఉస్మానియా విద్యార్థి శివన్నారాయణకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. దిష్టిబొమ్మపై పెట్రోలు చల్లుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో విద్యార్థులంతా ఆందోళనకు గురయ్యారు. ఘటనా స్థలిలోనే ఉన్న పోలీసులు, కొందరు విద్యార్థులు స్పందించి మంటలను ఆర్పివేసి శివన్నారాయణను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బాధితుడి వీపుపై గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో ఆర్ట్స్ కాలేజీ వద్ద బందోబస్తును పెంచారు.